కాంగ్రెస్ క్లాసుల్లో ‘దిశ’.. ప్రజంటేషన్ ఇచ్చిన దాసోజు శ్రవణ్

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ శిక్షణా తరగతుల్లో ‘దిశ’ కథనాలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల వరుసగా నిరుద్యోగుల ఆకలి కేకలను వినిపించిన దిశ కథనాలను ఈ శిక్షణా తరగతుల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, దిశ కథనాలను సూచిస్తూ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులను మోసం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రెండు ఒక్కటేనని, తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మూల కారణం ఉద్యోగాల్లో అన్యాయమేనన్నారు. […]

Update: 2021-11-10 03:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ శిక్షణా తరగతుల్లో ‘దిశ’ కథనాలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల వరుసగా నిరుద్యోగుల ఆకలి కేకలను వినిపించిన దిశ కథనాలను ఈ శిక్షణా తరగతుల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, దిశ కథనాలను సూచిస్తూ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులను మోసం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రెండు ఒక్కటేనని, తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మూల కారణం ఉద్యోగాల్లో అన్యాయమేనన్నారు. ప్రతి ఇంటికో ఉద్యోగం వస్తదని కేసీఆర్ అంటే.. మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని మోసం చేస్తున్నాడన్నారు.

స్వరాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు 98,016 వుంటే ఇటీవల బిశ్వాల నివేదిక ప్రకారం ఉద్యోగ ఖాళీల సంఖ్య 1,91,126కు చేరిందని వివరించారు. కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాత్రం రాష్ట్రంలో ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో 52,515 ఉద్యోగాలను తీసేశాడని వెల్లడించారు. మిషన్​ భగీరథ, ఫీల్డ్​ అసిస్టెంట్లు, సర్వశిక్షా అభియాన్​ తదితర శాఖల్లో పని చేసే ఉద్యోగులను తీసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్​ సమయంలో వైద్యశాఖలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు ఒక్కటీ కూడ లేదన్నారు.

ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం కార్పొరేషన్ల నుంచి రుణాలు కూడా ఇవ్వడం లేదని, టీఎస్​ ఐపాస్​ పేరుతో కేటీఆర్​ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులతో పాటుగా ప్రైవేట్​ సెక్టార్​లో పని చేసే ఉద్యోగులు కూడా రోడ్డున పడ్డారన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఉద్యోగాలు అంటూ ప్రకటిస్తున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని దాసోజు శ్రవణ్​ డిమాండ్​ చేశారు.

Tags:    

Similar News