విండీస్ బౌలర్ల అణచివేతకే 'బౌన్సర్ రూల్': సామి
దిశ, స్పోర్ట్స్: ఇటీవల జాతి వివక్షను ప్రశ్నించి వార్తల్లో నిలిచిన వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ తాజాగా ఐసీసీ లక్ష్యంగా విమర్శలు చేశాడు. విండీస్ బౌలర్లను అణచివేయడానికే బౌన్సర్ రూల్ ప్రవేశపెట్టారని ఆరోపించాడు. ‘ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లు డెన్నీస్ లిల్లీ, జెఫ్ థామ్సన్ తమ బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను గాయాల పాలు చేశారు. ఫైర్ ఇన్ బాబిలాన్ డాక్యుమెంటరీ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ డాక్యుమెంటరీలో లిల్లీ, థామ్సన్ భయంకరమైన బౌన్సర్లు సంధించారు. బ్యాట్స్‌మెన్ గాయపడ్డారు. కానీ, […]
దిశ, స్పోర్ట్స్: ఇటీవల జాతి వివక్షను ప్రశ్నించి వార్తల్లో నిలిచిన వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ తాజాగా ఐసీసీ లక్ష్యంగా విమర్శలు చేశాడు. విండీస్ బౌలర్లను అణచివేయడానికే బౌన్సర్ రూల్ ప్రవేశపెట్టారని ఆరోపించాడు. ‘ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లు డెన్నీస్ లిల్లీ, జెఫ్ థామ్సన్ తమ బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను గాయాల పాలు చేశారు. ఫైర్ ఇన్ బాబిలాన్ డాక్యుమెంటరీ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ డాక్యుమెంటరీలో లిల్లీ, థామ్సన్ భయంకరమైన బౌన్సర్లు సంధించారు. బ్యాట్స్‌మెన్ గాయపడ్డారు. కానీ, అప్పుడు ఈ రూల్ ప్రవేశపెట్టలేదు. ఎప్పటి నుంచైతే విండీస్ బౌలర్లు బౌన్సర్లు వేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే ఈ రూల్ తీసుకొచ్చారు. బహుశా నేను చెప్పింది తప్పు కూడా కావొచ్చు’ అని సామీ అన్నాడు. బౌన్సర్ల కారణంగా బ్యాట్స్‌మెన్ గాయాల పాలవుతుండటంతో ఐసీసీ ఓవర్‌కు రెండు బౌన్సర్లు మాత్రమే వేయాలనే రూల్ పెట్టింది. అంతకంటే ఎక్కువ వేస్తే బౌలర్లు తప్పించడమే కాకుండా ఎక్స్‌ట్రా పరుగులు కూడా ఇస్తారు.