పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బైకు
దిశ, పరిగి : రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వ్యానును వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(22) అతని తల్లి లక్ష్మీ చేవెళ్ల వెళ్లి తిరిగి వారి స్వగ్రామానికి బయలుదేరారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ గేటు సమీపంలో (ఏపీ 28 టీఏ 6211) నెంబరు […]
దిశ, పరిగి : రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వ్యానును వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(22) అతని తల్లి లక్ష్మీ చేవెళ్ల వెళ్లి తిరిగి వారి స్వగ్రామానికి బయలుదేరారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ గేటు సమీపంలో (ఏపీ 28 టీఏ 6211) నెంబరు గల డీసీఎం వ్యాను హైవే రహదారిపై ఆపి పంక్చర్ చేయించుకునేందుకు డ్రైవర్ వెళ్లాడు. బైకు పై తల్లితో కలిసి వస్తున్న శ్రీకాంత్ ఆగి ఉన్న డీసీఎం వ్యానును వెనుకనుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
వీరిని 108 వాహనంలో పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు అంబులెన్సులో తరలించారు. నగరంలోని లంగర్ హౌజ్ సమీపంలోని రెనోవా ఆస్పత్రికి తరలించారు. అయితే, శ్రీకాంత్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలైన లక్ష్మీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. కాగా, రోడ్డుపైనే డీసీఎం వ్యాను ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగి నిండు ప్రాణం పోయిందని వాహన చోదకులు అనుకుంటున్నారు.