అధిక విద్యుత్ ఉత్పత్తి వల్లే ప్రమాదం ?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: శ్రీశైలంలోని తెలంగాణ పరిధిలోకి వచ్చే ఎడమ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ప్యానల్ బోర్డ్(ఆక్సీలరి వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్) లో 9వ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాస్తవానికి ఈ యూనిట్ పరిధిలో 150 నుండి 180 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అధికారులు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ నియంత్రణ లేదా ఇతర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విద్యుత్ కేంద్రంలో రాత్రి ఒకేసారి 200 మెగావాట్ల […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: శ్రీశైలంలోని తెలంగాణ పరిధిలోకి వచ్చే ఎడమ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ప్యానల్ బోర్డ్(ఆక్సీలరి వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్) లో 9వ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాస్తవానికి ఈ యూనిట్ పరిధిలో 150 నుండి 180 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అధికారులు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ నియంత్రణ లేదా ఇతర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విద్యుత్ కేంద్రంలో రాత్రి ఒకేసారి 200 మెగావాట్ల సామర్థ్యానికి మించీ విద్యుత్ ఉత్పత్తి కావడంతో కెపాసిటీ మించి విద్యుత్ ఉండడంతో ప్యానల్ బోర్డ్ లో మంటలు చెలరేగాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదంతో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెద్ద ప్రమాదమే కాకుండా భారీ నష్టం అని నిపుణులు అంటున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది వరకు సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. ఇప్పటివరకు 10 మంది ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. వీరిని జెన్కో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఇంకా ప్రమాదంలో 9 మంది చిక్కుకొని ఉన్నారు. వీరిలో ఏడుగురు జెన్కో సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు. దట్టమైన పొగలు, మంటలు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ ప్రమాదం వల్ల జీరో లెవెల్ నుండి సర్వీస్ బే వరకు పొగలు కమ్ముకోవడంతో సహాయక సిబ్బంది కూడా లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.