అంగన్వాడీలో ఇచ్చిన కోడిగుడ్డును చూసి షాకైన దంపతులు
దిశ, మహముత్తారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని కోనంపేట అంగన్వాడీ సెంటర్‌లో డ్యామేజి గుడ్డు కలకలం రేపుతోంది. కోనంపేటకు చెందిన చిడెం.జయశ్రీ పైడి దంపతుల 10 నెలల పాపకు అంగన్వాడీ కేంద్రం నుండి మంగళవారం 8 కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాగా పాపకు పౌష్టికాహారం అందించేందుకు ఉదయాన్నే కోడిగుడ్డు ఉడికించి పొరుసు తీయగా గుడ్డు ఒక భాగం నల్లగా డ్యామేజీ అయి ఉందని, పాప తండ్రి పైడి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు […]
దిశ, మహముత్తారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని కోనంపేట అంగన్వాడీ సెంటర్‌లో డ్యామేజి గుడ్డు కలకలం రేపుతోంది. కోనంపేటకు చెందిన చిడెం.జయశ్రీ పైడి దంపతుల 10 నెలల పాపకు అంగన్వాడీ కేంద్రం నుండి మంగళవారం 8 కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాగా పాపకు పౌష్టికాహారం అందించేందుకు ఉదయాన్నే కోడిగుడ్డు ఉడికించి పొరుసు తీయగా గుడ్డు ఒక భాగం నల్లగా డ్యామేజీ అయి ఉందని, పాప తండ్రి పైడి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం పంపిణీ చేస్తుంటే ఇక్కడ మాత్రం చెడిపోయిన గుడ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సూపర్‌వైజర్ మమతను వివరణ కోరగా మాకు ప్రస్తుతం మీటింగ్‌లు ఉన్నాయని వారం రోజుల తర్వాత సెంటర్‌కి వచ్చి వివరాలు చెప్తానని బదులిచ్చారు.