కోదాడ ఎమ్మెల్యేకు షాక్.. ‘రాజీనామా చెయ్’ అంటూ ర్యాలీ

దిశ, కోదాడ: హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ రాష్ట్రంలోని అందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని భావించిన ప్రజలు గులాబీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం రాజీనామా […]

Update: 2021-08-01 00:56 GMT

దిశ, కోదాడ: హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ రాష్ట్రంలోని అందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని భావించిన ప్రజలు గులాబీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు రూ. 10లక్షల ఇస్తాడని వెల్లడించారు.

ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగి రాజు సంఘీభావం తెలిపారు. ర్యాలీలో పాల్గొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు వెళ్తుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు రాజును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ… దళిత బంధు కోదాడ నియోజకవర్గ ప్రజలకు రావాలంటే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగన్, భాగ్యమ్మ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News