చిన్న పొరపాటు.. కరెంట్ షాక్‌తో రోజు వారి కూలీ మృతి..
దిశ, తుంగతుర్తి: విద్యుత్ శాఖలో రోజువారి కూలిగా పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన సోమవారం తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వెంపటి గ్రామానికి చెందిన రిక్కల సురేష్(26) అనే వ్యక్తి తుంగతుర్తి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో లైన్ మెన్ కింద రోజువారి కూలీగా పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గానుగుబండ గ్రామానికి వెళ్లే విద్యుత్ లైను ఫీడర్‌లో మరమ్మత్తు ఏర్పడగా సురేష్‌ని అక్కడికి పంపారు. […]
దిశ, తుంగతుర్తి: విద్యుత్ శాఖలో రోజువారి కూలిగా పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన సోమవారం తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వెంపటి గ్రామానికి చెందిన రిక్కల సురేష్(26) అనే వ్యక్తి తుంగతుర్తి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో లైన్ మెన్ కింద రోజువారి కూలీగా పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గానుగుబండ గ్రామానికి వెళ్లే విద్యుత్ లైను ఫీడర్‌లో మరమ్మత్తు ఏర్పడగా సురేష్‌ని అక్కడికి పంపారు.
గానుగుబండ గ్రామానికి వెళ్లే విద్యుత్తు లైను స్తంభాన్ని ఎక్కే బదులుగా దాని పక్క నుండి రెడ్డిగూడెం గ్రామానికి వెళ్లే మరో విద్యుత్ స్తంభాన్ని ఎక్కగా విద్యుత్ ఘాతంతో అక్కడే కిందపడిపోయారు. కొన ఊపిరితో ఉన్న సురేష్‌ను కొందరు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. మృతునికి కుమారునితో పాటు నిండు గర్భిణీ అయిన భార్య ఉంది. తెలంగాణ సామాజిక న్యాయ వేదిక వ్యవస్థాపకులు అన్నపర్తి జ్ఞాన సుందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.