అటల్ టన్నెల్లో రోజుకో యాక్సిడెంట్
దిశ, వెబ్‌డెస్క్: అటల్ టన్నెల్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సొరంగ మార్గంలో కొందరు వాహనాలను రేసింగ్ తో నడపుతూ.. ప్రయాణం చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు. దీంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని ప్రభుత్వాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అధికారులు కోరారు. ఈ నెల 3వ తేదీన లేహ్-మనాలీ మధ్య నిర్మించిన అటల్ సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: అటల్ టన్నెల్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సొరంగ మార్గంలో కొందరు వాహనాలను రేసింగ్ తో నడపుతూ.. ప్రయాణం చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు. దీంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని ప్రభుత్వాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అధికారులు కోరారు.
ఈ నెల 3వ తేదీన లేహ్-మనాలీ మధ్య నిర్మించిన అటల్ సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మార్గంలో ప్రయాణిస్తే 46 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త టూరిస్ట్ ప్రాంతంగా ఈ టన్నెల్ మారింది. కాగా, వాహనచోదకులు, పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇది ప్రారంభమైన మూడు రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగాయి.
అటల్ టన్నెల్ వద్ద విధులు నిర్వహిస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీరు బ్రిగేడియర్ కేపీ పురుషోత్తమన్ మాట్లాడుతూ.. ప్రారంభించిన నాటి నుంచి మూడు యాక్సిడెంట్లు నమోదయ్యాయని తెలిపారు. ప్రమాదాలను నిరోధించేందుకు ట్రాఫిక్ పోలీసులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ టన్నెల్ లో వాహనాలను నిలిపేందుకు ఏ ఒక్కరికి కూడ అనుమతి లేదని స్పష్టం చేశారు.