మందుబాబులకు మరింత షాక్.. ఆర్టీఏ అధికారులకు పోలీసుల లేఖ

దిశ,వెబ్‌డెస్క్:మద్యంతాగి డ్రైవ్ చేస్తున్న హైదరాబాద్ వాసులకు పోలీసులు కొరడా ఝులిపించనున్నారు. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా  హైదరాబాద్ లో ఉన్న మూడు కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ ల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించిన 496మందిపై, సైబరాబాద్ కమిషనరేట్ లో 931మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పాటు 751 బైకులు, 190కార్లు, 18ఆటోలు,2లారీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇన్ని చేసినా వాహనాదారుల తీరు మార్చుకోవడంలేదు. మధ్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారు. […]

Update: 2021-01-28 23:27 GMT

దిశ,వెబ్‌డెస్క్:మద్యంతాగి డ్రైవ్ చేస్తున్న హైదరాబాద్ వాసులకు పోలీసులు కొరడా ఝులిపించనున్నారు. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న మూడు కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ ల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించిన 496మందిపై, సైబరాబాద్ కమిషనరేట్ లో 931మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పాటు 751 బైకులు, 190కార్లు, 18ఆటోలు,2లారీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇన్ని చేసినా వాహనాదారుల తీరు మార్చుకోవడంలేదు. మధ్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో వాహనదారులపై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడితే వారి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులను సైబరాబాద్ పోలీసులు లేఖ ద్వారా కోరారు. శాశ్వతంగా లైసెన్స్ రద్దయితే వాహనదారులు రోడ్డకే అవకాశం ఉండదని పోలీసులు అంటున్నారు. ఒకవేళ ఆ నిబంధనలు అతిక్రమించి లైసెన్స్ లేకుండా పట్టుబడితే కేసు నమోదు చేసుకుని వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News