సైబరాబాద్ పోలీసుల షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్.. గెలిస్తే మస్త్ డబ్బులు
దిశ,డైనమిక్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ఫలితం దక్కడం లేదు. దీనికి కారణం వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే.. అయితే ఇలాంటి వారిని మార్చేందుకు సైబరాబాద్ పోలీసులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించే విధంగా లఘు చిత్రాలు(షార్ట్ ఫిల్మ్) తీయించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు సరైన గుర్తింపు కోసం ఎదురు […]
దిశ,డైనమిక్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ఫలితం దక్కడం లేదు. దీనికి కారణం వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే.. అయితే ఇలాంటి వారిని మార్చేందుకు సైబరాబాద్ పోలీసులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించే విధంగా లఘు చిత్రాలు(షార్ట్ ఫిల్మ్) తీయించాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో ఎంతో మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు సరైన గుర్తింపు కోసం ఎదురు చూస్తు్న్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. వారి టాలెంట్‌కు పదును పెట్టే విధంగా ‘రోడ్డు భద్రత పై అవగాహన కల్పించే చిత్రాల’ పై పోటీ నిర్వహించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. అచ్చ తెలంగాణ యాసతో ఈ ట్వీట్ ఉండటంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ట్వీట్ సారాంశం ప్రకారం ‘‘అగో సైబరాబాద్ పోలీసోళ్లు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించడానికి చిన్న సైన్మాల పోటీ పెట్టినరు.. అందరూ మంచి సైన్మా తీసి పంపండి మరి. గెలిచేనోళ్లకి మస్త్ డబ్బులు వస్తాయి.’’ అని ఉంది.
అగో సైబరాబాద్ పోలీసోళ్ళు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించనికీ చిన్న సైన్మాల పోటీ పెట్టినరు. అందరు మంచి సైన్మా తీసి పంపండి మరి.
గెలిచినోళ్ళకి మస్త్ డబ్బులు వస్తాయి.
Theme – "Road Safety and Us"#ShortFilmContest #RoadSafety pic.twitter.com/1aql0FUtp8
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) September 3, 2021