సైబర్ కి‘లేడి’.. డాలర్లు వచ్చాయని.. లక్షలు కొట్టేసింది

దిశ, ఇల్లందు: ఫేస్ బుక్ లో అయిన పరిచయం ఒక ఉద్యోగి రూ. 10 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఆంగోతు సుధీర్ కు కవిత శర్మ పేరుతో ఓ మహిళ ఫోన్ చేసింది. రోస్ లీ నికోలస్ పేరుతో 50 వేల డాలర్లు పంపించారని, తాను కస్టమ్స్ అధికారిగా పరిచయమైంది. ఫేస్ బుక్ లో కూడా సుధీర్ తో చాటింగ్ చేసేది. పార్సిల్ ఇండియా […]

Update: 2021-03-23 08:49 GMT

దిశ, ఇల్లందు: ఫేస్ బుక్ లో అయిన పరిచయం ఒక ఉద్యోగి రూ. 10 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఆంగోతు సుధీర్ కు కవిత శర్మ పేరుతో ఓ మహిళ ఫోన్ చేసింది. రోస్ లీ నికోలస్ పేరుతో 50 వేల డాలర్లు పంపించారని, తాను కస్టమ్స్ అధికారిగా పరిచయమైంది. ఫేస్ బుక్ లో కూడా సుధీర్ తో చాటింగ్ చేసేది.

పార్సిల్ ఇండియా రావాలంటే ఆదాయ పన్ను తోపాటు ఇతర ఖర్చులు ఉంటాయని నమ్మబలికింది. అది నమ్మిన సుధీర్ పలు దఫాలుగా రూ. 10,72,500 రూపాయలు ఆమె తెలిపిన బ్యాంక్ అకౌంట్ లో జమ చేశాడు. ఎప్పటికీ డాలర్లు రాకపోవడంతో అనుమానం వచ్చి కవిత శర్మకు ఫోన్ చేయగా.. మరో లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాలో వేయాలని తెలిపి ఫోన్ కట్ చేసింది. దీంతో బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News