వంద పోయిందా..? ఫిర్యాదు చేసేయండి
దిశ, కూకట్ పల్లి: మారుతున్న సాంకేతికకు అనుగుణంగానే రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. సాధారణ దొంగతనాలకు రెండింతలు సైబర్ నేరగాళ్లు ప్రజలు సొమ్మును కాజేస్తున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించడానికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైం వింగ్‌ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గిఫ్ట్ కార్డులు, అమెజాన్ వార్షికోత్సవాల పేరుతో మోసాలు నేడు సమాజంలో వందలో 90 మంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి […]
దిశ, కూకట్ పల్లి: మారుతున్న సాంకేతికకు అనుగుణంగానే రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. సాధారణ దొంగతనాలకు రెండింతలు సైబర్ నేరగాళ్లు ప్రజలు సొమ్మును కాజేస్తున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించడానికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైం వింగ్‌ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
గిఫ్ట్ కార్డులు, అమెజాన్ వార్షికోత్సవాల పేరుతో మోసాలు
నేడు సమాజంలో వందలో 90 మంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి నిరంతరం టెక్నాలజీని వినియోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికీ రోజుకూ ఓ సారి మీకు గిఫ్ట్ వచ్చిందంటూ వాట్సప్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్ వస్తుంది. ఇది నిజమేనని నమ్మి లక్షలాది మంది సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. వందల నుంచి లక్షల దాకా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వందల నుంచి వేల వరకు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగ లేక, అలాగే కమిషనరేట్లో చిన్న మొత్తానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించక పోతుండటంతో.. మోసపోయిన వారు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.
ఇక ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం వింగ్
ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సైబర్ క్రైం వింగ్‌లో 50 వేలకు పైన డబ్బులు పోయిన వారికి సంబంధించిన ఫిర్యాదులు మాత్రమే స్వీకరించే వారు. దీంతో ప్రజలు మోసపోయినా.. ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాష్ట్ర డీజీపీ అదేశాల ప్రకారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు మాధాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం వింగ్లో వంద రూపాయల నుంచి ఎంత మొత్తం పోగొట్టుకున్నా ఫిర్యాదు చేయవచ్చన్నాుజ
ఏడాదిలో 36 కోట్లకు టోకరా
గత ఏడాది సాధారణ దొంగతనాల రూపంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దొంగలు దొంగిలించిన సొత్తు మొత్తం రూ.11 కోట్లు వరకు ఉంటుంది ఇక సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.36 కోట్ల వరకు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైం వింగ్‌ను ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైబర్ నేరాలు
ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్రాలను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరగాళ్లు నేరాలను చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్లు తమ కేంద్రాలను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్ మాదిరిగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడేండుకు ఉద్యోగులను నియమించుకుని ఎవరు ఎంత మందిని మోసం చేస్తే.. వారికి అదే స్థాయిలో ఇన్సెంటివ్స్ ఇస్తూ సాంకేతిక మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది.