‘పింక్ వాట్సాప్’ నయా లింక్స్.. క్లిక్ చేస్తే అంతే సంగతులు..!

దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే టార్గెట్‌గా కొత్త కొత్త లింక్స్ పంపిస్తూ వారి నుంచి డేటా, అకౌంట్స్ నుంచి నగదును అపహరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి హైటెక్ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రంగుల వాట్సాప్ పేరుతో కొత్త లింక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ వాట్సా్ప్ పింక్ కలర్‌లోకి మారిపోతుందంటూ లింక్స్ షేర్ అవుతున్నాయి. దీనికి వాట్సాప్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. […]

Update: 2021-04-17 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే టార్గెట్‌గా కొత్త కొత్త లింక్స్ పంపిస్తూ వారి నుంచి డేటా, అకౌంట్స్ నుంచి నగదును అపహరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి హైటెక్ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రంగుల వాట్సాప్ పేరుతో కొత్త లింక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ వాట్సా్ప్ పింక్ కలర్‌లోకి మారిపోతుందంటూ లింక్స్ షేర్ అవుతున్నాయి. దీనికి వాట్సాప్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి అవి వైరస్ లింక్‌లు అని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

ఒక్కసారి ఆ లింకుల మీద క్లిక్ చేస్తే డేటా చోరికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా తెలియకుండా చేస్తే వెంటనే పాస్ వర్డులు మార్చుకోవాలని లేదా ఫోన్ రీసెట్ చేసుకోవాలని హితవు పలికారు. దీనికి సంబంధించి సైబర్ క్రైం వింగ్ సైబరాబాద్ పోలీస్ వారు స్పందించింది. ఈ లింక్‌ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. నేటితరం యువత వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tags:    

Similar News