‘రైనా రిప్లేస్‌మెంట్ ఫేక్ న్యూస్’
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2020 నుంచి వ్యక్తిగత కారణాలతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అతని స్థానంలో మరొకరికి తీసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ సంచలన డేవిడ్ మలన్‌ను రైనా స్థానంలో తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలే అని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ అన్నారు. ‘ఇది […]
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2020 నుంచి వ్యక్తిగత కారణాలతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సురేష్ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అతని స్థానంలో మరొకరికి తీసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ సంచలన డేవిడ్ మలన్‌ను రైనా స్థానంలో తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలే అని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ అన్నారు.
‘ఇది నిజంగా మాకు కూడా పెద్ద వార్తే. మా విదేశీ ఆటగాళ్ల కోటా నిండిపోయింది. అలాంటప్పుడు డేవిడ్ మలన్‌ను తీసుకునే అవకాశం ఎక్కడ ఉంది’ అని విశ్వనాథన్ అన్నారు. ఐపీఎల్ (IPL) నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీలో 8 మంది విదేశీ, 17 మంది భారత ఆటగాళ్లు మాత్రమే కలిగి ఉండాలి. ఇప్పటికే సీఎస్కే (CSK) జట్టులో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, జోష్ హజల్ వుడ్, మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డూప్లెసిస్, సామ్ కరణ్‌లను కలిగి ఉంది. నిబంధనల ప్రకారం వారికి విదేశీ ఆటగాడిని తీసుకునే అవకాశమే లేదు.