IPL‌లోకి పుజార.. అమ్ముడుపోని విహారి.. వసీం జాఫర్ ఫన్నీ ట్వీట్

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజార ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నారు. టెస్టుల్లో మంచి బ్యాట్స్‌మాన్‌గా టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే పుజారను.. ధనాధన్ క్రికెట్‌కు మాత్రం అందరూ దూరం పెట్టారు. 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున చివరి సారిగా ఆడిన పుజారకు.. గత ఆరేళ్లుగా జరిగే ప్రతీ వేలంలోనూ నిరాశే ఎదురైంది. అయితే ఈ సారి చెన్నై సూపర్ […]

Update: 2021-02-18 11:34 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజార ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నారు. టెస్టుల్లో మంచి బ్యాట్స్‌మాన్‌గా టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే పుజారను.. ధనాధన్ క్రికెట్‌కు మాత్రం అందరూ దూరం పెట్టారు. 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున చివరి సారిగా ఆడిన పుజారకు.. గత ఆరేళ్లుగా జరిగే ప్రతీ వేలంలోనూ నిరాశే ఎదురైంది. అయితే ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 50 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. దీంతో 7 ఏళ్ల విరామం అనంతరం పుజార ఐపీఎల్‌లో కనిపించబోతున్నాడు. పుజార రాకను సీఎస్కే ఘనంగా ఆహ్వానించింది. ట్విట్టరో‌లో ‘చే బుజ్జీ’కి స్వాగతం అంటూ పోస్టు పెట్టింది. మరో వైపు పుజారకు మంచి సహజోడిగా టెస్టుల్లో రాణించే హనుమ విహారిని మాత్రం ఎవరూ కొనుగోలు చేయలేదు. విహారి కనీస ధరను రూ. 1.50 కోట్లుగా నిర్ణయించారు. వేలం పాటలో రెండు సార్లు టేబుల్ వద్దకు వచ్చినా.. అతడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు.

తొలిసారి పుజారను ఐపీఎల్‌లోకి తీసుకోవడంపై టీంఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ హజిల్ వుడ్‌ను ట్రోల్ చేస్తూ మరోసారి మీరు నెట్స్‌లో పుజారకు బౌలింగ్ చేయవలసి ఉంటుందని రాసుకొచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన గత టెస్టులో టీం ఇండియా తరఫున పుజారా 928 బంతులు ఆడాడు. అతన్ని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు తీవ్రంగా శ్రమించగా.. ఒకనొకా సందర్బంలో హజిల్ వుడ్ నిరాశకు లోనయినట్లు ఉన్న పిక్చర్‌ను షేర్ చేశాడు వసీం.

Tags:    

Similar News