ఎస్ఈసీకి సీఎస్ లేఖ
దిశ,వెబ్‌డెస్క్: ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ లేఖలో తెలిపారు. ఓ వైపు ఎన్నికల నిర్వహణ..మరో వైపు వ్యాక్సినేషన్ సాధ్యం కాదని చెప్పారు. ఎన్నికలకు సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ వ్యాక్సినేషన్ కారణంగా ఇప్పుడు సాధ్యం కాదని పేర్కొన్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ 60 రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. తర్వాతనే ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఎన్నికలు, వ్యాక్సిన్‌కు […]
దిశ,వెబ్‌డెస్క్: ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ లేఖలో తెలిపారు. ఓ వైపు ఎన్నికల నిర్వహణ..మరో వైపు వ్యాక్సినేషన్ సాధ్యం కాదని చెప్పారు. ఎన్నికలకు సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ వ్యాక్సినేషన్ కారణంగా ఇప్పుడు సాధ్యం కాదని పేర్కొన్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ 60 రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. తర్వాతనే ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఎన్నికలు, వ్యాక్సిన్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని కోర్టు చెప్పిందన్నారు. ఎన్నికలకు కొత్త షెడ్యూల్ రూపొందించాలని సీఎస్ కోరారు. ఎన్నికలు,వ్యాక్సినేషన్ సజావుగా సాగేవిధంగా చూడాలని కోరారు.