ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై సీఎస్ కీలక ఆదేశాలు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కౌంటింగ్‌కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఎస్ఈసీ ఈనెల 19న కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ ​వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో ఏర్పాట్లపై చర్చించారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని […]

Update: 2021-09-17 06:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కౌంటింగ్‌కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఎస్ఈసీ ఈనెల 19న కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ ​వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో ఏర్పాట్లపై చర్చించారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మాస్కులు, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్కింపు సజావుగా సాగేలా చూడాలని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు సీఎస్ ఆదేశాలిచ్చారు.

Tags:    

Similar News