మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-09-21 14:59 GMT

దిశ, ఉట్నూర్ : స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క అన్నారు. శనివారం కేబీ ప్రాంగణంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్​ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దొత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జి ఆత్రం సుగుణక్కతో కలిసి ప్రారంభించారు. మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని మహిళా శక్తి మండల సమాఖ్యకు (96 మహిళా సంఘాలకు) రూ. 5 కోట్ల 9 లక్షల రుణాల చెక్కును మహిళలకు అందించారు.

    ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం మొబైల్ అంబులెన్స్ లను ప్రారంభించి, లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందించారు. అంతకు ముందు గిరిజన బీఈడీ కళాశాలలో రూ. 60 లక్షలతో నిర్మించిన బాలికల వసతి గృహంను ప్రారంభించారు. అనంతరం వికాసం బాలబడిలో రూ. 60 లక్షలతో చేపట్టిన భవనంను ప్రారంభించారు. అనంతరం కోడి పిల్లల పెంపకం కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆమెకు కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు స్వాగతం పలికారు. పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. మంత్రికి పలు సంఘాల నాయకులు సమస్యలపై వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమాల అనంతరం పీఎమ్మార్సీ భవనంలో ఆదివాసీ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ఆయా శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News