BREAKING: వనస్థలిపురంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం, ముగ్గురు పెడ్లర్ల అరెస్ట్

తెలంగాణ డ్రగ్స్ కల్చర్‌ను రూపుమాపేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.

Update: 2024-06-18 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డ్రగ్స్ కల్చర్‌ను రూపుమాపేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్‌, గంజాయిని తరలించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎల్బీ‌నగర్ ఎస్‌వోటీ, వనస్థలిపురం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుల నుంచి 26 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, డ్రగ్‌ను నిందితులు కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.    


Similar News