దారుణం...8 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచార యత్నం

పెద్దపెల్లి జిల్లాలో రెండు సంఘటనలు జరిగి 15 రోజులు గడవకముందే కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కూనారం గ్రామంలో మతిస్థిమితం లేని ఎనిమిదేళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు.

Update: 2024-07-02 10:02 GMT

దిశ,కాల్వ శ్రీరాంపూర్ : పెద్దపెల్లి జిల్లాలో రెండు సంఘటనలు జరిగి 15 రోజులు గడవకముందే కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కూనారం గ్రామంలో  ఎనిమిదేళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు.

    సోమవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పరీక్ష నిమిత్తం బాలికను పెద్దపెల్లి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దారుణానికి ఒడిగట్టిన వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

వరుస ఘటనలు..

పెద్దపల్లి జిల్లాలో వరుసగా అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచార యత్నం జరగడం పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో హత్యాచారం ఆపై హత్య జరిగిన ఘటన జరిగి వారం రోజులు గడవకముందే సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో హత్యాచారయత్నం జరగడం జిల్లాలో కలువరం సృష్టిస్తోంది. 


Similar News