యూసఫ్ గూడ, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

యూసఫ్ గూడ, బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

Update: 2024-12-29 08:47 GMT

దిశ, జూబ్లీహిల్స్ : యూసఫ్ గూడ, బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... భువనగిరి ప్రాంతానికి చెందిన దోసపాటి బాలరాజు (35) అనే వ్యక్తి యూసఫ్ గూడ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలరాజు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించి అప్రమత్తమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలరాజు మృతి ఘటన స్థానికంగా బెటాలియన్లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Similar News