food poisoning : ఫుడ్ పాయిజన్ తో యువతి మృతి
మండలంలోని పొచ్చేరా గ్రామ సమీపాన ఉన్న సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన వంట మనిషి పూల్ కాళి బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
దిశ, బోథ్ : మండలంలోని పొచ్చేరా గ్రామ సమీపాన ఉన్న సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన వంట మనిషి పూల్ కాళి బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… సెయింట్ థామస్ పాఠశాల కు చెందిన ఐదుగురు సిబ్బంది బట్టల కొనుగోలు కు నిర్మల్ కు 02/112024(శనివారం ) రోజున వెళ్లారు. షాపింగ్ ముగిసిన తర్వాత నిర్మల్ లోని గ్రిల్ 9 రెస్టారెంట్ లో భోజనం చేయడానికి చికెన్ కు సంబంధించిన ఫుడ్ ను హోటల్ లోనే తిన్నారు. అదే రోజు సాయంత్రం తిన్న వారిలో ఒకరికి వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడం తో బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించారు.
ఆసుపత్రి వైద్యులు పరీక్షించి ఫుడ్ పాయిజన్ అయినట్లుగా నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత సోమవారం రోజు సాయంత్రం మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ…ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెయింట్ థామస్ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ స్మిత ఆ హోటల్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. దీంతో ఎస్సై ఫిర్యాదు ను స్వీకరించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.