రాష్ట్రంలో మరో దారుణం.. 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు
తెలంగాణ(Telangana)లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్(Munirabad)లో యువతి దారుణ హత్య(Young Woman Murder)కు గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్(Munirabad)లో యువతి దారుణ హత్య(Young Woman Murder)కు గురైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కిరాతకంగా కొట్టిచంపారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు(Medical Police) హుటాహుటిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హత్య(Murder)కు, మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త అతి క్రూరంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్యను తలపై కర్రలతో మోది హత్య చేసి.. ఆ తర్వాత మటన్ కత్తితో నరికి.. శరీర భాగాలను బకెట్‌లో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించాడు. ఈ ఘటనను ప్రజలు ఇంకా మరువకముందే.. మునీరాబాద్‌లో గుర్తు తెలియని దుండుగులు 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కిరాతకంగా కొట్టి చంపడం కలకలం రేపుతోంది.