దైవ దర్శనానికి వెళ్లివస్తూ అనంత లోకాలకు..

ఆదివారం అర్ధరాత్రి రూరల్ మండలంలో జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2025-03-24 05:33 GMT
దైవ దర్శనానికి వెళ్లివస్తూ అనంత లోకాలకు..
  • whatsapp icon

దిశ, ఖమ్మం రూరల్ : ఆదివారం అర్ధరాత్రి రూరల్ మండలంలో జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగరం 59వ డివిజన్ కు చెందిన పల్లపు రాము (46), అతని స్నేహితుడు కృష్ణమూర్తి (50), సురేష్ అనే వ్యక్తి కలిసి ఆదివారం శ్రీశైలం దైవదశానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమీపంలో రూరల్ మండలం మద్దులపల్లి శివారున కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పల్లపు రాము తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న కృష్ణమూర్తి కూడా మృత్యువాత పడ్డారు. కాగా సురేష్ గాయాలపాలై బయటపడ్డాడు. మృతుడు పల్లపు రాముకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News