2 డాలర్ల టిప్ ఇచ్చిన గర్భిణీ స్త్రీని దారుణంగా పోడిచిన పిజ్జా డెలివరీ లేడీ

తనకు వచ్చిన 2 డాలర్ల టిప్ కు సంతృప్తి చెందని పిజ్జా డెలివరీ లేడీ.. అతి దారుణంగా ఓ మహిళపై కత్తితో దాడి చేసింది.

Update: 2025-03-24 05:11 GMT
2 డాలర్ల టిప్ ఇచ్చిన గర్భిణీ స్త్రీని దారుణంగా పోడిచిన పిజ్జా డెలివరీ లేడీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తనకు వచ్చిన 2 డాలర్ల టిప్ కు సంతృప్తి చెందని పిజ్జా డెలివరీ లేడీ (Pizza delivery lady).. అతి దారుణంగా ఓ మహిళపై కత్తితో దాడి (Attack with a knife) చేసింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని కిస్సిమ్మీలోని రివేరా మోటెల్‌ (Riviera Motel) లో 2024 డిసెంబర్ నెలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బ్రియానా అల్వెలో పిజ్జా డెలివరీ‌గా పనిచేస్తుంది. పిజ్జా డెలివరీ చేసిన తర్వాత ఆమెకు వచ్చిన $2 టిప్ పట్ల అల్వెలో అసంతృప్తి చెందింది. కేవలం 2 డాలర్ల (సుమారు 170 రూపాయలు) టిప్ (Tip) ఇచ్చిందనే కోపంతో ఆమెపై అరిచింది.

దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన బ్రియానా.. కొద్ది సేపటి తర్వాత మరొకరిని తీసుకొని బాదితురాలి ఇంటికి వెళ్లి.. ఆమెపై విచక్షణ రహితంగా కత్తితో 14 సార్లు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె గర్భవతి అని తేలింది. యువతి దాడిలో తీవ్రంగా గాయాలు కావడంతో గర్భిణీ స్త్రీ (pregnant woman).. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కాగా దాడికి పాల్పడిన నిందితురాలు బ్రియానా అల్వెలోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సర్వీస్ ఇండస్ట్రీలో టిప్పింగ్ సంస్కృతిపై తీవ్ర చర్చకు దారితీసింది.


Similar News