రెండు రోజుల్లో విధుల్లో చేరిక.. అంతలోనే పలకరించిన మృత్యువు..
మొన్న జరిగిన బదిలీల్లో బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న పడాల విజయ్ కుమార్ ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

దిశ, ఎల్లారెడ్డి : మొన్న జరిగిన బదిలీల్లో బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న పడాల విజయ్ కుమార్ ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఎల్లారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో సోమవారం విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న క్రమంలో శనివారం ఏవో విజయ్ కుమార్ కు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన విజయ్ కుమార్ బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో కొన్ని రోజులుగా విధులు నిర్వహించి బదిలీలో చేరడం అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల ఎల్లారెడ్డి ఆర్టీవో కార్యాలయం సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.