కేర్ ఆస్పత్రిలో దారుణం.. గాయాలతో వెళ్లిన యువతిపై అత్యాచారయత్నం
తీవ్ర గాయాలతో ప్రాణాలు కాపాడాలని ఆస్పత్రికి వెళ్లిన యువతిపై అత్యాచారయత్నం చేశాడు ఓ టెక్నీషియన్.
దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర గాయాలతో ప్రాణాలు కాపాడాలని ఆస్పత్రికి వెళ్లిన యువతిపై అత్యాచారయత్నం చేశాడు ఓ టెక్నీషియన్. గాయాలతో బాధపడుతున్న ఆమె దుస్తులు తొలగించి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వైజాగ్‌కు చెందిన యువతి స్కూటీపై వెళ్తుండగా.. సిరిపురం జంక్షన్ వద్ద యాక్సిడెంట్‌కు గురైంది. స్థానికులు వెంటనే ఆమెను రాంనగర్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు ఎక్స్ రే టెస్టులు రాశారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్ రే మిషన్ ఉన్నా నాలుగో అంతస్తులో చివరి గదిలో ఉన్న మరో ఎక్స్ రే రూంను తరలించిన ఎక్స్ రే టెక్నీషియన్.. టెస్టులు చేస్తున్నట్లు నటించి ఆమె దుస్తులు తొలగించి అత్యాచార యత్నం చేయబోయాడు. భయపడిన యువతి కేకలు వేయడంతో బంధువులు అలర్ట్ అయ్యారు.
ఎక్స్ రే టెక్నీషియన్‌ను పట్టుకోని దేహశుద్ది చేశారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనను ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది. వెంటనే అతడిని విధుల నుంచి తొలగించింది. ఘటనపై పోలీసులే చూసుకుంటారని తమకే సంబంధం లేదని దాటవేసే ప్రయత్నం చేసింది. అయితే గాయాలతో వచ్చిన అమ్మాయి పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.