బేకరీలలో పనిచేస్తూ పార్ట్ టైం గా డ్రగ్స్ దందా..మాటు వేసి పట్టుకున్న పోలీసులు

జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు సులువుగా డబ్బు

Update: 2024-11-08 07:01 GMT

దిశ,పేట్ బషీరాబాద్: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు సులువుగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. గుజరాత్ భావనగర్ కు చెందిన గులాని ఆసిఫ్ (30) కొంపల్లి లో ఉంటూ పలు బేకరీలలో పనిచేస్తుంటాడు. ఇతను తన జల్సాల కోసం డబ్బును సంపాదించడానికి ముంబైలో ఉన్న ఆలీ అని వ్యక్తి వద్ద నుంచి ఎండీఎంఏ తో పాటుగా డ్రై గంజాయి తీసుకోవచ్చు నగరంలో సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తూ యువతకు విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శుక్రవారం కొంపల్లి లో తరుణ్ వ్యాస్ (30), మహమ్మద్ ఇక్బాల్ (26), సుశాంత్ కుమార్ రెడ్డి (27) లకు విక్రయిస్తుండగా పెట్ బషీరాబాద్, మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

రూ.  4 లక్షల 40 వేల విలువైన 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటుగా నాలుగు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే సైబరాబాద్ ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ 7091105423 లేదా 9490617444 వాట్సప్ ద్వారా పోలీసులకు సమాచారం మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి ప్రజలకు సూచించారు. మేడ్చల్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఎస్ఓటీ అడిషనల్ డిసిపి శోభన్ కుమార్, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, సీఐ కె విజయవర్ధన్, మేడ్చల్ జోన్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి లు పాల్గొన్నారు.


Similar News