కుప్పంలో తీవ్ర విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన తమిళ ఏనుగులు

ఏనుగుల గుంపు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందడంతోపాటు మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2023-05-12 07:28 GMT

దిశ, తిరుపతి : ఏనుగుల గుంపు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందడంతోపాటు మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కుప్పం మండలంలో ఈ విషాద ఘటన సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం మండలం పర్తిచేను గ్రామానికి చెందిన ఉషా (30) అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళ్లి బెంగళూరులో పనులు చేసుకుంటుంది. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం మల్లానూరు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో ఏనుగుల గుంపు ఎదురైంది. వాటిని చూసిన మహిళలు భయంతో పరుగులు తీసినా వెంటపడిన ఏనుగులు ముగ్గురు మహిళలపై దాడి చేశాయి. ఈ దాడి నుంచి ఇద్దరు మహిళలు గాయాలతో తప్పించుకోగా.. ఏనుగులకు చిక్కిన ఉషా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

ఒంటరి వాళ్లైన పిల్లలు

కాగా, ఉషా భర్త దేవేంద్ర గతంలోనే మృతి చెందాడు. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. వీరిలో ఓ అమ్మాయికి వివాహం చేయగా కుమారుడు బేకరిలో పని చేస్తున్నాడు. చిన్నమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ప్రస్తుతం తల్లి మృతితో ఏ దిక్కులేని వారిగా చిన్నారులు మిగిలిపోయారు.

ఏడు గ్రామాల్లో ఏనుగుల గుంపు హల్ చల్

కాగా, గత మూడు రోజులుగా తమిళనాడు నుండి సుమారు ఐదు ఏనుగులతో కూడిన గుంపు కుప్పం మండలంలో తిష్ట వేశాయి. అవ్వి సుమారు ఏడు పంచాయతీల్లో తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు రాత్రుల్లో ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఏనుగుల గుంపు గ్రామాల వైపు వచ్చాయన్న సమాచారం లేకపోవడంతో ఈ విపత్తు జరిగింది.

Also Read. Crime News: కులాంతర వివాహం.. ప్రేమజంట దారుణ హత్య 

CBSE: సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే హవా 


Similar News