అమ్మో.. నన్ను ఎన్ కౌంటర్ చేస్తారు..? ఆస్పత్రికి వెళ్లే ఖైదీ ఆందోళన (వీడియో)

ఎన్ కౌంటర్. ఈ పదమే వివాదస్పదం.

Update: 2023-03-16 11:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ కౌంటర్. ఈ పదమే వివాదస్పదం. ఎన్ కౌంటర్లలో ఎక్కువ శాతం నకిలీవేనని న్యాయస్థానాలు, పౌరసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. టెర్రరిస్ట్, మావోయిస్ట్, హంతకులు.. ఇలా ఎవరికి శిక్ష విధించినా చట్టబద్దంగా చేయాలనేది చట్టం చెబుతోంది. కానీ కొందరు పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారనే అభియోగాలు తరచూ వస్తూనే ఉన్నాయి. జైలు నుంచి ఖైదీలను తీసుకెళ్తు కూడా ఎన్ కౌంటర్లు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులంటే నిందితులకు భయం ఉంటుంది. తాజాగా ఓ ఖైదీ ఇదే భయాందోళన వ్యక్తం చేశారు. తనను ఎన్ కౌంటర్ చేయనని లెటర్ రాసిస్తేనే తను మీతో వస్తానని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హర్దోయి జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న రిజ్వాన్ అనే ఖైదీకి మూత్రపిండాల వ్యాధి ఉన్నది అతడికి డయాలసిస్ చేయాల్సి రావడంతో పోలీసులు అతడిని ఎస్టార్ట్ వాహనంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే రిజ్వాన్‌కు పోలీసులపై అనుమానం వచ్చి చికిత్సకు నిరాకరించాడు. తనను దారి మధ్యలో పోలీసులు చంపేస్తారని భయాందోళన వ్యక్తం చేశాడు. తనును ఎన్ కౌంటర్ చేయనని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే చికిత్స చేయించుకుంటానని భీష్మించుకు కూర్చున్నాడు. పోలీసులు అలా ఏం జరగదని ఎంత నచ్చచెప్పినా రిజ్వాన్ వినలేదు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

Tags:    

Similar News