బెడ్ రూమ్‌లో ఫోర్స్ చేస్తున్న భార్య.. తట్టుకోలేక కోర్టును ఆశ్రయించిన భర్త

ఇటీవల కాలంలో భర్తలతో, భార్యలు చిన్న విషయాలకే గొడవలు పడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. కొంత మంది ఏకంగా వేధింపులు కూడా చేస్తున్నారు.

Update: 2022-12-04 08:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భర్తలతో, భార్యలు చిన్న విషయాలకే గొడవలు పడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. కొంత మంది ఏకంగా వేధింపులు కూడా చేస్తున్నారు. ఆ మనోవేదనను తట్టుకోలేక భర్తలు పోలీసులను లేదా కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే బెంగుళూరులో జరిగింది. మతం మారాలని భార్య వేధింపులు తట్టుకోలేక భర్త కోర్టును ఆశ్రయించాడు.

ఇతర మీడియా కథనం ప్రకారం.. బెంగుళూరు మహాలక్ష్మి లేఅవుట్ లోని అశోక్ పురంలో దీపక్, సునీతా గ్రేసీ అనే దంపతులు 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీపక్ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి జీవితం సాఫీగా సాగింది. ఈ క్రమంలో సునితా గ్రేసీ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. దీపక్ ఇతర దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి భార్యకు పంపేవాడు. ఆ డబ్బులను భార్య జల్సాలు చేస్తూ వచ్చేది. అయితే కొన్ని రోజుల తర్వాత దీపక్‌కు, గ్రేసీపై అనుమానం వచ్చింది. ఒక రోజు భార్యను నిలదీయగా జల్సాలు బయటపడ్దాయి. అవన్నీ ఆపేసి అతడు చెప్పినట్టు వినమని ఆదేశించాడు. దానికి గ్రేసీ నువ్వు మతం మార్చుకో అలా చేస్తేనే నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పింది. దీంతో భర్త చచ్చినా క్రైస్తవ మతంలోకి చేరనని చెప్పాడు. అయినా ఆ మాటలు పట్టించుకోని భార్య బెడ్ రూమ్‌లో రోజూ ఆ విషయంపై గొడవ పడేది. అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భర్తపై వరకట్నం వేధింపుల కేసు కూడా పెడతానని బెదిరించింది. అది భరించలేని భర్త కోర్టును ఆశ్రయించి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం.. మత మార్పిడి కోసం బలవంతం చేయడం నేరమని పోలీసులకు బాధితురాలిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Read more:

శృంగార లాడ్జి.. ఒకేసారి ముగ్గురు అమ్మాయిలతో.. (వీడియో)

బ్రాడ్‌తో SEX సీన్‌.. మొత్తం విప్పి చూపించమని ఒత్తిడి చేశారు


Similar News