సీఎం సభకు తరలిస్తున్న జనరేటర్ వాహనం ఢీకొని ఇద్దరి మృతి
తెనాలిలో జరిగే సీఎం సభకు తరలిస్తున్న జనరేటర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.
దిశ, వెబ్‌డెస్క్: తెనాలిలో జరిగే సీఎం సభకు తరలిస్తున్న జనరేటర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. చేబ్రోటు మండలం వడ్లమూడి సమీపంలోని గరువుపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ జనరేటర్‌ను ఓ ఆటోకు వెనకభాగంలో తాడుతో కట్టి నారా కోడూరు నుంచి తెనాలికి తరలిస్తుండగా గరువుపాలెం వద్ద జనరేటర్ - ఆటోకు కట్టిన తాడు తెగిపోయింది. అదే సమయంలో మహిళా కూలీలతో వస్తున్న ఆటో జనరేటర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో రమణమ్మ(50), శాంబ(25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని తెనాలి, గుంటూరు, వడ్లమూడి హాస్పిటల్‌లకు తరలించారు.