crime : ఒకే తరహాలో రెండు హత్యలు...
చిన్నశంకరంపేటలో ఇరువురిని బండరాయితో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహానికి నిప్పంటించిన సంఘటనలో అనుమానాలు ఉన్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేటలో ఇరువురిని బండరాయితో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహానికి నిప్పంటించిన సంఘటనలో అనుమానాలు ఉన్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి(SP Uday Kumar Reddy )తెలిపారు. స్పెషల్ టీం ని ఏర్పాటు చేసినట్లు వీరిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఆదివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి గుట్ట వద్ద మెదక్ -చేగుంట రోడ్డుపై గల బస్టాండ్ లో మరో వ్యక్తిని హత్య చేసి మృతదేహానికి నిప్పంటించిన సమాచారం స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ అందించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, రామాయంపేట సీఐ. వెంకట రాజా గౌడ్, తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి తో సంఘటన స్థలానికి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో ఆదివారం చేరుకొని (32) సంవత్సరాల యువకుని మృతదేహాన్ని పరిశీలించారు. గత నెల 23న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనకాల డోర్ వద్ద( 25) సంవత్సరాల వయసు గల వ్యక్తి ని హత్య చేసి నిప్పంటించినట్లు తెలిపారు.
ఈ రెండు హత్యలు ఒక్కరే చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా గ్రామంలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ తెలియజేయాలని కోరారు. అయితే ఈ విషయంపై అన్ని కోణంలో సీసీ ఫుటేజ్ ల ద్వారా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారని,ఈ హత్యలు మీరే చేస్తున్నారా! లేదా ఎవరు చేస్తున్నట్లు అనే కోణంలో ఇక్కడికి వలస వచ్చి పని చేసే కూలీలను విచారిస్తున్నట్లు తెలిపారు.ఈ మృతదేహాలకు సంబంధించి ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని, అన్ని విధాలుగా, స్పెషల్ టీం ని ఏర్పాటు చేసినట్లు అతి త్వరలోనే ఈ హత్యల పట్ల దుండగులను పట్టుకుంటామని తెలిపారు. ఈ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు.