మహిళపై దౌర్జన్యం చేసిన కేసులో రెండున్నరేళ్లు జైలు

వరుసకు వదినపై దౌర్జన్యం చేసి వేధించిన కేసులో వ్యక్తికి రెండున్నరేళ్లు కఠినకారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు.

Update: 2024-10-01 14:48 GMT

దిశ, గోదావరిఖని : వరుసకు వదినపై దౌర్జన్యం చేసి వేధించిన కేసులో వ్యక్తికి రెండున్నరేళ్లు కఠినకారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...తిరుమలనగర్ కు చెందిన ఓ వివాహితను వరుసకు మరిది అయిన వరంగల్ కొత్తవాడకు చెందిన బొద్దుల కిరణ్ 2017వ సంవత్సరంలో చుట్టపుచూపుగా వచ్చి అగర్వపరిచే విధంగా మాట్లాడి దౌర్జన్యం చేశాడు.

    బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ ఏ.మహేందర్ కేసు నమోదు చేయగా మరో సీఐ పర్స రమేష్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరిచారు. అనంతరం అదనపు జిల్లా న్యాయస్థానంలో కేసు విచారణ నిర్వహించగా ప్రస్తుత సీఐ ఏ.ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కోర్టు లైజన్ ఆఫీసర్ కొత్తకొండ శంకర్ 11 మంది సాక్షులను ప్రవేశ పెట్టగా అదనపు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.జ్యోతి రెడ్డి ప్రాసిక్యూషన్ తరుపున వాదనలు వినిపించారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.  

Tags:    

Similar News