ట్రిప్పర్ బోల్తా... డ్రైవర్ మృతి
ముధోల్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం రోడ్డుపై అదుపు తప్పి ట్రిప్పర్ బోల్తా పడడంతో ట్రిప్పర్ డ్రైవర్ ఆల్తాప్ ( 38) అక్కడికక్కడే మృతి చెందాడు.
దిశ, ముధోల్ : ముధోల్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం రోడ్డుపై అదుపు తప్పి ట్రిప్పర్ బోల్తా పడడంతో ట్రిప్పర్ డ్రైవర్ ఆల్తాప్ ( 38) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐ మల్లేష్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ తెప్పించి టిప్పర్ నుంచి మృతదేహం బయటకు తీసేందుకు ప్రయత్నించగా సాధ్య పడలేదు.
ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారి నిర్మిస్తున్న అనుష కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో జేసీబీ తెప్పించి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో హైడ్రాలిక్ క్రేన్ తెప్పించి టిప్పర్ ను పైకి లేపి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని భైంసా కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.