Tragedy: రాష్ట్రంలో సంచలన ఘటన.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఓ ఎస్సై ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్/వరంగల్ బ్యూరో: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రుద్రారపు హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఏటూరు నాగారం మండలంలోని ముల్లకట్ట బ్రిడ్జికి సమీపంలోని ఉన్న ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వృత్తిపరమైన ఒత్తిడా.. వ్యక్తిగత, కుటుంబ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏటూరు నాగారం మండల పరిధిలోని చెల్పాక ప్రాంతంలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తరువాత ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం ములుగు జిల్లా పోలీసులను షాక్‌కు గురిచేసింది.