సిరిసిల్లలో విషాదం... భార్యాభర్తలు ఆత్మహత్య
అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం 37వ వార్డు వెంకంపేట మైసమ్మ గల్లిలోని నేత కుటుంబానికి చెందిన బైరి అమర్(45), ఆయన భార్య స్రవంతి(40) అప్పుల బాధతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మానాన్నల మృతదేహాల వద్ద వారు రోదిస్తున్నతీరు అందరినీ కంటతడి పెట్టిచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.