Tragedy: తీవ్ర విషాదం.. పసిపిల్లల ప్రాణం తీసిన ఎలుకల మందు
ఎలుకల మందు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లోని కుంద్రత్తూరు (Kundrathur)లో చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: ఎలుకల మందు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లోని కుంద్రత్తూరు (Kundrathur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని ఓ వ్యక్తి పెస్ట్ కంట్రోల్ (Pest Control) వాళ్లతో మాట్లాడి ఇంట్లో ఎలుకల మందును స్ప్రే చేయించాడు. అయితే, వేయాల్సిన మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో మందును స్ప్రే చేశారు. అనంతరం అదే ఇంట్లో రాత్రంతా కుటుంబం ఆ మందును పీల్చడంతో కుటుంబం మొత్తం తీవ్ర అస్వస్థతకు గురైంది. అందులో ఇద్దరు చిన్నారులు విశాలిని (6), సాయి సుదర్శన్ (1) పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదేవిధంగా భార్యాభర్తలు బోరూరు (Boruru)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.