పాలిసెట్ పరీక్ష కోసం వెళ్లి పెళ్లిపీటలు ఎక్కారు..!

ఉన్నతమైన లక్ష్య సాధన కోసం పాలీసెట్ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన (16) ఏళ్ల బాలిక పరీక్ష రాసిన అనంతరం ప్రియుడు మాయమాటలు నమ్మి ఏకంగా పెళ్లి పీటలు ఎక్కింది.

Update: 2023-05-18 16:54 GMT

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఉన్నతమైన లక్ష్య సాధన కోసం పాలీసెట్ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన (16) ఏళ్ల బాలిక పరీక్ష రాసిన అనంతరం ప్రియుడు మాయమాటలు నమ్మి ఏకంగా పెళ్లి పీటలు ఎక్కింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదవ తరగతి అనంతరం ఈ నెల 17న పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష పేరుతో ఇంటి నుంచి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష అనంతరం ప్రియుడి మాయమాటలు నమ్మి ఏకంగా పెళ్లి పీటలెక్కింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ఆ జంటను పట్టుకొని బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు. బాలికకు మాయమాటలు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై గురువారం కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిసింది.

Tags:    

Similar News