పెళ్లికి నిరాకరించిన యువతి..యువకుడు ఆత్మహత్య
ప్రేమ విఫలమైందని యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో
దిశ,నర్మెట్ట : ప్రేమ విఫలమైందని యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల ఎస్సై నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అమ్మాపురం గ్రామ శివారు పిట్టల గూడెం కు చెందిన గుజరాతి లక్ష్మయ్య (20), రెండు సంవత్సరాల నుండి బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. ప్రేమ విఫలమైందని మనస్థాపం చెంది సోమవారం రోజు గూడెం పక్కన ఉన్నటువంటి కెనాల్ దగ్గర మెనోపాస్ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన గ్రామస్థులు హుటాహుటిగా జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంకాలం మృతి చెందాడు.మృతుని తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగేష్ తెలిపారు.