విద్యార్థి చేయి విరిగేలా కొట్టిన టీచర్.. ఎందుకంటే?

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా విద్యార్థులు తెలియని తనంతో కొట్టుకుంటే వాళ్లను టీచర్, మందలించి కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. అయితే కొందమంది విద్యార్థులు వినకుంటే వారికి సర్దచేప్పి వినేలా చేస్తారు..Latest Telugu News

Update: 2022-08-29 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా విద్యార్థులు తెలియని తనంతో కొట్టుకుంటే వాళ్లను టీచర్, మందలించి కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. అయితే కొందమంది విద్యార్థులు వినకుంటే వారికి సర్దచేప్పి వినేలా చేస్తారు. కానీ ఓ టీచర్ మాత్రం దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో టీచర్ కోపంతో విద్యార్ధి చేయి విరిగేలా కొట్టాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. తిత్వాలాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి, మరో విద్యార్థితో గొడవ జరిగింది. ఇదంతా ఓ స్టూడెంట్ టీచర్‌కు చెప్పాడు. దీంతో అది తెలుసుకున్న టీచర్ కోపంతో ఊగిపోయి కర్రతో ఒక విద్యార్థి మోచేయి విరిగేలా కొట్టాడు. దీంతో సమాచారం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స చేసిన వైద్యులు విద్యార్థి మోచేయి విరిగినట్లు తెలిపారు. ఆ టీచర్ పై స్టూడెంట్ తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Also Read : విద్యార్థినిపై పైశాచికత్వం.. అధ్యాపకురాలిపై ప్రభుత్వం సస్పెన్షన్ 


Also Read : పాల ధరల పెంపుపై నేడు కీలక ప్రకటన?


Similar News