స్కూళ్లో బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు.. వీడియోలు తీసిన ఉపాధ్యాయుడు
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. సమాజంలో గురువు స్థానాన్ని దిగజార్చిలా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారులను నగ్నంగా మార్చి.. డ్యాన్స్‌లు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, విద్యార్థినుల తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జబల్పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తు్న్న రామ్‌సింగ్ ఠాకూర్.. మార్చి 11న దేవాలయంగా భావించే పాఠశాలలో దాష్టికానికి పాల్పడ్డాడు. స్కూల్లో 4, 5వ తరగతి చదువుతున్న బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వారిని తరగతి గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా అర్ధనగ్నంగా మార్చాడు. అనంతరం వారితో డ్యాన్స్‌లు చేయించాడు. అంతటి ఆగని కామాంధుడు ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఉపాధ్యాయుడి చేష్టలకు భయపడిన ఓ బాలిక ఈ విషయం తన తల్లికి చెప్పింది. దీంతో కోపాద్రికురాలైన తల్లి, గ్రామస్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన ఈ నెల11న జరిగినా ఉపాధ్యాయుడు రాంసింగ్ బెదిరింపులకు భయపడిన చిన్నారి ఆలస్యంగా తన తల్లిదండ్రులకు చెప్పింది. ప్రిన్సిపల్, బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ఉపాధ్యాయుడు రామ్‌సింగ్ ఠాకూర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.