ఇద్దరు విద్యార్థుల జీవితాలను చిదిమేసిన ఇసుక లారీ

చర్ల మండలం సుబ్బంపేట గ్రామం వద్ద ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి.

Update: 2024-10-15 13:47 GMT

దిశ, భద్రాచలం : చర్ల మండలం సుబ్బంపేట గ్రామం వద్ద ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. మృతులు మురళి, రేవంత్ కుమార్​ చర్లలోని ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. చర్ల నుంచి వరంగల్ వైపునకు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ, సుబ్బంపేట నుంచి ద్విచక్ర వాహనంపై చర్ల వస్తున్న విద్యార్థులను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News