ఊర్లకు వెళ్తున్నారా..? తాళం చేతులు జాగ్రత్త!

ఊర్లకు వెళ్లే ప్రయాణికులు తమ ఇంటి తాళం చేతులు గూట్లో, సబ్జాలపై పెట్టి వెళ్లవద్దని కేసముద్రం సీఐ సర్వయ్య ప్రజలను కోరారు.

Update: 2024-11-16 10:45 GMT

దిశ, కేసముద్రం: ఊర్లకు వెళ్లే ప్రయాణికులు తమ ఇంటి తాళం చేతులు గూట్లో, సబ్జాలపై పెట్టి వెళ్లవద్దని కేసముద్రం సీఐ సర్వయ్య ప్రజలను కోరారు. శనివారం ఆయన కేసముద్రం పోలీసు స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగలకు తాళం చేతులు ఇచ్చే విధంగా వాటిని పెట్టి వెళ్తున్నారని సీఐ వాపోయారు. ఎవరు కూడా ఇంటి తాళం చేతులు గూట్లో, సబ్జాలపై పెట్టి వెళ్లవద్దని కోరారు. అలా వెళ్తే దొంగలకు తమ పని సులువు అవుతుందన్నిరు. మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు తమ ఆభరణాలు ధరించి, జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. కానీ ఆభరణాలను బాగుల్లో పెట్టుకొని వెళ్తే దొంగలు మోసం చేసి అపహరిస్తారని తెలిపారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ సర్వయ్య సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మురళీధర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News