దేశాన్ని అస్థిరపరచాలన్నది వారి కుట్ర.. కోర్టుకు ఇచ్చిన ఛార్జీషీట్లో వివరించిన ఎన్ఐఏ
అంతర్గత అలజడులు సృష్టించటం ద్వారా దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్న పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా దక్షిణాదిలో నెట్‌వర్క్‌ను పెంచుకునే కుట్రను అమలు చేస్తోంది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అంతర్గత అలజడులు సృష్టించటం ద్వారా దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్న పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా దక్షిణాదిలో నెట్‌వర్క్‌ను పెంచుకునే కుట్రను అమలు చేస్తోంది. ఆ తరువాత ఉత్తరాదిపై దృష్టి పెట్టాలని పథకాలు రూపొందించుకుంది. పీపుల్స్ఫ్రంట్అగ్రనేతల్లో ఒకరు అరెస్టయిన తరువాత అప్రూవర్ గా మారి స్వయంగా ఈ విషయాలను మెజిస్ర్టేట్ఎదుట వెల్లడించారు. కొంతకాలం క్రితం పీపుల్స్ఫ్రంట్కు చెందిన 19మంది కీలక సభ్యులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ కోర్టులో ఛార్జీషీట్దాఖలు చేస్తూ అందులో పలు కీలక విషయాలను వివరించారు.
2047 సంవత్సరంలోపు భారత్‌లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా మతం పేరుతో వందల సంఖ్యలో యువకులను ఉగ్రబాటలోకి నడిపిస్తోందని ఎన్ఐఏ అధికారులు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. సామాజిక రాజకీయ ఉద్యమం ముసుగులో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపారు. అరెస్టు చేసిన 19మందిలో పన్నెండుమంది పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా నేషనల్ఎగ్జిక్యూటీవ్సభ్యులని పేర్కొన్నారు.
యువకులను ఉగ్రబాటలోకి..
లక్ష్యాన్ని సాధించేందుకుగాను పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా చాపకింది నీరులా తన కార్యకలాపాలను విస్తరిస్తోందని వివరించారు. గతంలో జరిగిన మతఘర్షణల వీడియోల క్లిప్పింగులు..వార్తల కటింగులు చూపించి మతం పేర రెచ్చగొడుతూ ఉగ్రవాదం బాటలోకి నడిపిస్తోందని తెలియచేశారు. ఇలా వచ్చిన వారిలో చురుకుగా...శారీరకంగా ధృఢంగా ఉన్నవారితో స్ర్టయికింగ్టీములను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. మిగిలిన వారిలో ఎంపిక చేసిన వారితో సపోర్ట్టీములను ఏర్పాటు చేస్తున్నారన్నారు. సపోర్టు టీములు టార్గెట్‌గా చేసిన వారికి సంబంధించి రెక్కీ జరిపి వివరాలను స్ర్టయికింగ్టీములకు అందిస్తాయని తెలియచేశారు. దాంతోపాటు ఆయుధాలు కూడా సమకూరుస్తారని పేర్కొన్నారు.
ఆ తరువాత స్ర్టయికింగ్టీముల సభ్యులు రంగంలోకి దిగి కుట్రలను అమలు చేస్తారని వివరించారు. ఇలా అలజడులు సృష్టించటం ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచాలన్నది వారి కుట్ర అని తెలియచేశారు. కొంతకాలం క్రితం తర్భియాత్సెషన్స్నిర్వహించిన పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా పాకిస్తాన్అంతర్గత అలజడులు పెరిగినపుడు భారత సైన్యం దృష్టి మొత్తం దానిపైనే ఉంటుందని, అదే అవకాశంగా ఉత్తర భారతదేశంలో నెట్‌వర్క్‌ను విస్తరించాలని నిర్ణయించినట్టుగా అప్రూవర్‌గా మారిన పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా సభ్యుడు విచారణలో వెల్లడించినట్టు ఛార్జీషీట్లో వివరించారు. ఇప్పటికే పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా వందల సంఖ్యలో యువకులను రిక్రూట్‌చేసుకుని ఆత్మరక్షణ పేరుతో వారికి సాయుధ శిక్షణ ఇచ్చినట్టుగా తెలిపారు.
పీపుల్స్ప్రంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చెబితే అప్పుడు వీళ్లు రంగంలోకి దిగి అలజడులు సృష్టించటానికి తయారుగా ఉన్నట్టు వివరించారు. పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా సిద్ధాంతాలను వ్యతిరేకించే వారితోపాటు వేర్వేరు రాజకీయ పార్టీల నాయకులను టార్గెట్చేయాలన్నదే వారి లక్ష్యమని తెలిపారు. దీనికోసం సపోర్ట్టీములు, స్ర్టయికింగ్టీములను రంగంలోకి దింపి లక్ష్యంగా చేసుకున్న వారిని హత్యలు చేయాలన్నది పీపుల్స్ఫ్రంట్ఆఫ్ఇండియా కుట్ర అని పేర్కొన్నారు. తద్వారా మతఘర్షణలను సృష్టించి ప్రభుత్వాలను అస్థిరపరచాలన్నది దాని ఉద్దేశ్యమని వివరించారు.