వారం వ్యవధిలోనే తండ్రికొడుకులు మృతి..

రామగిరి మండలం కల్వచర్ల గ్రామం వద్ద బైక్ ను లారి ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడ్డ బాలుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

Update: 2023-07-06 11:00 GMT

దిశ, రామగిరి : రామగిరి మండలం కల్వచర్ల గ్రామం వద్ద బైక్ ను లారి ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడ్డ బాలుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత శుక్రవారం కల్వచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ఆ ప్రమాదంలో తండ్రి కారుపాకల సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ సిద్ధార్థ్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్ధార్థ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల్లోనే తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Tags:    

Similar News