భార్యతో గొడవపడి కనిపించకుండా పోయిన భర్త..

భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయిన భర్త కనిపించకుండా పోయిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-05-30 15:20 GMT

దిశ, బడంగ్​పేట్​: భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయిన భర్త కనిపించకుండా పోయిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పహాడిషరీప్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్​ గుల్​ ఇంద్రానగర్​ కాలనీకి చెందిన స్వప్నమోని నరసింహ(30), శైలజలు దంపతులు. నరసింహ వంటపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహ సంబంధ విషయంలో భార్యతో గొడవపడి దాడి చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ తన పిల్లలతో కలిసి శ్రీరాంకాలనీలో తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది.

అదే రోజు రాత్రి 9.30 గంటలకు శ్రీరాంకాలనీకి చేరుకున్న నరసింహ మరోమారు భార్య శైలజతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళి పోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం చుట్టు పక్కన బంధువుల ఇళ్ళలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో శైలజ పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకుని పహాడి షరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News