బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
బస్సులో హఠాత్తుగా మంటలు చేలరేగాయి.
దిశ , కోదాడ టౌన్ : టీఎస్ఆర్టీసీ బస్సులో హఠాత్తుగా మంటలు చేలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వద్ద చోటు చేసుకుంది. బీఎచ్ఈఎల్ డిపోకి చెందిన TS08Z0028 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన బస్ డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్క సారిగా మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Also Read...