కోర్టు సంచలన తీర్పు...నిందితునికి 60 సంవత్సరాల జైలు

మైనర్ బాలికల అత్యాచారం కేసులలో నిందితునికి 60 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు.

Update: 2024-12-31 15:01 GMT

దిశ, గొల్లపల్లి : మైనర్ బాలికల అత్యాచారం కేసులలో నిందితునికి 60 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు. మండల పరిధిలోని ముగ్గురు మైనర్ బాలికలపై శివరాత్రి ముత్తయ్య అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ కి ఆధారాలు సమర్పించడంతో నేరం రుజువుకాగా నిందితుడికి ఒక్కొక్క కేసుకు 20 సంవత్సరాల చొప్పున మొత్తం 60 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, 1000 జరిమానా, బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణ రావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ డీఎస్పీలు రఘు చందర్ , వెంకటస్వామి, ఎస్ఐలు సతీష్, నరేష్, కోర్ట్ కానిస్టేబుల్స్ శ్రీధర్, కిరణ్ ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. 


Similar News