అనారోగ్యం కారణంగా టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Update: 2023-03-30 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులో రాణించలేదనో, తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలం అయిందని ఇలా ప్రతి కారణాలకు చావు ఒకటే మార్గం అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ పదో తరగతి విద్యార్థిని తనకున్న అనారోగ్య సమస్యతో చదువుపై దృష్టి పెట్టలేకపోతుందని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని లలితాబాగ్‌లో శ్రీజ (15) అనే బాలిక తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. శ్రీజ వాణి విద్యానికేతన్‌లో 10 వ తరగతి చదువుతుంది. మైనర్ బాలిక థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ.. చదువుపై దృష్టి పెట్టలేకపోయింది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కావడం లేదని తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.

Tags:    

Similar News